కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద చెక్
ABN , Publish Date - Jun 04 , 2026 | 02:00 AM
నార్వే చెస్‌లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత స్టార్ ప్రజ్ఞానంద చెక్ చెప్పాడు. 8వ రౌండ్‌లో నల్ల పావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద 50వ ఎత్తులో కార్ల్‌సన్‌ను ఓడించి...
గుకేష్ టైటిల్ ఆశలకు గండి
ఒస్లో: నార్వే చెస్‌లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత స్టార్ ప్రజ్ఞానంద చెక్ చెప్పాడు. 8వ రౌండ్‌లో నల్ల పావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద 50వ ఎత్తులో కార్ల్‌సన్‌ను ఓడించి, మొత్తంగా 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ ఓటమితో కార్ల్‌సన్ (9 పాయింట్లు) ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక 8వ రౌండ్లో అలీరెజా ఫిరౌజా చేతిలో ఓడిన గుకేష్ 8 పాయింట్లతో ఆఖరి స్థానానికి పడిపోయాడు. దీంతో అతనికి టైటిల్ ఆశలు అడుగంటాయి. వెస్లీ సో (14) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల విభాగం 8వ రౌండ్లో అన్నా ముజిచుక్‌పై అర్మగెడాన్‌లో హంపి గెలిచింది. అయినా హంపి 8 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది. బిబిసారా అస్సౌబయేవా చేతిలో ఓడిన దివ్యాదేశ్‌ముఖ్ (10) మూడోస్థానంలో ఉంది. బిబిసారా (15.5) టాప్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..