Share News

పోక్సో కేసులో పారా ఆర్చరీ కోచ్‌

ABN , Publish Date - May 22 , 2026 | 01:52 AM

పోక్సో కేసులో జాతీయ పారా ఆర్చరీ కోచ్‌ కుల్దీప్‌ వేద్వన్‌కు కోర్టు ఐదేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. కోచ్‌ కుల్దీప్‌ తనను లైంగికంగా...

పోక్సో కేసులో పారా ఆర్చరీ కోచ్‌

చండీగఢ్‌: పోక్సో కేసులో జాతీయ పారా ఆర్చరీ కోచ్‌ కుల్దీప్‌ వేద్వన్‌కు కోర్టు ఐదేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. కోచ్‌ కుల్దీప్‌ తనను లైంగికంగా వేధించినట్టు 2023లో ఓ మైనర్‌ ఆర్చర్‌ ఫిర్యాదు చేసిం ది. దాంతో అతడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అయితే 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు కుల్దీప్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసుపై విచారణ జరిపిన ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక కోర్టు వేద్వన్‌కు కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 15వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. చేతుల్లేని పారా ఆర్చర్‌ శీతల్‌ దేవికి కుల్దీప్‌ మార్గదర్శనం చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..

రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 22 , 2026 | 01:52 AM