పాక్ క్రికెటర్లు లక్షల్లో మోసపోయారు
ABN , Publish Date - Jan 23 , 2026 | 05:00 AM
పాకిస్థాన్‌కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు పోంజి స్కీములో భారీగా నష్టపోయారు. మోసం చేసిన వ్యక్తి ఆ ఆటగాళ్లకు బాగా తెలిసినవాడే కావడం గమనార్హం.
లాహోర్: పాకిస్థాన్‌కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు పోంజి స్కీములో భారీగా నష్టపోయారు. మోసం చేసిన వ్యక్తి ఆ ఆటగాళ్లకు బాగా తెలిసినవాడే కావడం గమనార్హం. వ్యాపారవేత్త అయిన అతడు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కొన్ని జట్లకు స్పాన్సర్‌గానూ వ్యవహరించాడు. స్వల్ప కాలంలో పెద్దమొత్తంలో రాబడులు వస్తాయని ఆశపడిన బాబర్ ఆజమ్, రిజ్వాన్, షహీన్ షా అఫ్రీది, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్ తదితరులు రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ వ్యాపారవేత్త పరారైనట్టు చెబుతున్నారు.