స్వర్ణ పోరుకు మనమ్మాయిలు
ABN , Publish Date - Sep 13 , 2026 | 06:33 AM
డ్రాగ్ ఫ్లికర్ సుప్రియ హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టడంతో.. మహిళల జూనియర్ ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
సెమీస్‌లో కొరియాపై గెలుపు
నేడు ఫైనల్లో చైనాతో ఢీ
మోకి (చైనా): డ్రాగ్ ఫ్లికర్ సుప్రియ హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టడంతో.. మహిళల జూనియర్ ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 5-1తో కొరియాను చిత్తు చేసింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. భారత జట్టులో సుప్రియ (17వ, 33వ, 56వ) మూడు గోల్స్ చేయగా.. మధు సిదర్ (13వ), సుఖ్‌వీర్ కౌర్ (21వ) చెరో గోల్ సాధించారు. కొరియా తరఫున ఏకైక గోల్‌ను యూరి జియాంగ్ (41వ) చేసింది. మరో సెమీస్ లో చైనా 6-0తో జపాన్‌ను ఓడించింది.
పురుషుల ఫైనల్ కూడా..
జూనియర్ ఆసియా కప్ పురుషుల విభా గంలో ఇప్పటికే ఫైనల్ చేరిన భారత్ టైటిల్ పోరు జరిగేది కూడా ఆదివారమే. కొరియాతో డిఫెండింగ్ చాంప్ భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.