Share News

జొకోవిచ్‌ జోరు

ABN , Publish Date - Jul 03 , 2026 | 01:53 AM

మాజీ చాంపియన్‌ జొకోవిచ్‌ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్న ఈ సెర్బియా స్టార్‌..

జొకోవిచ్‌ జోరు

మూడో రౌండ్‌లో ప్రవేశం

స్వియటెక్‌ కూడా

వింబుల్డన్‌

లండన్‌: మాజీ చాంపియన్‌ జొకోవిచ్‌ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్న ఈ సెర్బియా స్టార్‌.. రెండో రౌండ్‌ను మాత్రం ఏకపక్షంగా ముగించాడు. స్టెఫానో సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఏడో సీడ్‌ జొకో 6-3, 6-4, 6-2 తేడాతో ఓడించాడు. జొకోవిచ్‌ ఈ మ్యాచ్‌లో నాలుగు బ్రేక్‌పాయింట్లతో పాటు 12 ఏస్‌లు సంధించాడు. ఇక రెండో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-1, 6-3, 7-6 తేడాతో రోయెర్‌ (ఫ్రాన్స్‌)ను, ఐదో సీడ్‌ డి మినార్‌ (ఆసీస్‌) 6-3, 6-2, 6-2తో మన్నారినో (ఫ్రాన్స్‌)ను, ఆరో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ 6-2, 6-2, 7-5 తేడాతో కిప్సన్‌ను, తొమ్మిదో సీడ్‌ కొబొల్లి (ఇటలీ) 7-6, 3-6, 7-6, 6-1తో డ్యూక్‌వర్త్‌ (ఆసీస్‌)ను ఓడించి మూడో రౌండ్‌లో ప్రవేశించారు. మరోవైపు మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌, మూడో సీడ్‌ స్వియటెక్‌ (పోలాండ్‌) 6-1, 6-3 తేడాతో కరోలినా ప్లిస్కోవా (చెక్‌)ను సునాయాసంగా ఓడించింది. ఆరోసీడ్‌ అనిసిమోవా (యూఎస్‌) 6-2, 4-6, 7-6తో కెనిన్‌ (యూఎస్‌)పై, 12వ సీడ్‌ మార్టా కోస్టుక్‌ (ఉక్రెయిన్‌) 7-6, 6-3, 6-3 తేడాతో అన్నా బ్లింకోవా (రష్యా)పె నెగ్గింది. ఇక పురుషుల డబుల్స్‌లో యుకీ భాంబ్రీ-మైకేల్‌ వీనస్‌ (ఆసీస్‌), అనిరుధ్‌ చంద్రశేఖర్‌-యుజుకి (జపాన్‌), ఎన్‌.శ్రీరామ్‌ బాలాజీ-డిమోలినెర్‌ (బ్రెజిల్‌) జోడీలు తమ ప్రత్యర్థుల చేతిలో ఓడాయి.

ఈ వార్తలనూ చదవండి:

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..

మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..

Updated Date - Jul 03 , 2026 | 01:53 AM