ఆసీస్ టెన్నిస్ స్టార్ కిరియోస్‌పై నిషేధం
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:54 AM
వింబుల్డన్ మాజీ ఫైనలిస్ట్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) తాను డోపింగ్‌లో పట్టుబడ్డట్టు తెలిపాడు. ఇటీవల తనకు నిర్వహించిన డ్రగ్ పరీక్షలో...
జెనీవా: వింబుల్డన్ మాజీ ఫైనలిస్ట్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) తాను డోపింగ్‌లో పట్టుబడ్డట్టు తెలిపాడు. ఇటీవల తనకు నిర్వహించిన డ్రగ్ పరీక్షలో నిషేధిత మాదకద్రవ్యం కొకైన్ పాజిటివ్‌గా తేలిందని కిరియోస్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ప్రస్తుతం కిరయో్‌సపై తాత్కాలిక నిషేధం విధించారు. నిబంధనల ప్రకారం అతడిపై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే, పార్టీ డ్రగ్ కావడంతో కఠిన చర్యలు తీసుకోక పోవచ్చని అంటున్నారు. 2017లో బ్రిటిష్ ఆటగాడు డాన్ ఇవాన్స్.. కొకైన్ తీసుకొన్నట్టు తేలడంతో అతడిపై ఏడాది మాత్రమే వేటువేశారు.