Share News

ముగింపు వేడుకల పతాకధారిగా నీరూ ధాండా

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:08 AM

ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా స్టార్‌ షూటర్‌ నీరూ ధాండా వ్యవహరించనుంది.

ముగింపు వేడుకల పతాకధారిగా నీరూ ధాండా

నగోయ: ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా స్టార్‌ షూటర్‌ నీరూ ధాండా వ్యవహరించనుంది. ఆదివారంతో ఈ క్రీడలు ముగియనున్నాయి. ఆరోజు ముగింపు ఉత్సవం సందర్భంగా జరిగే మార్చ్‌పా్‌స్టలో 27 ఏళ్ల నీరూ భారత మహిళల జట్టును ముందుండి నడిపించనుందని భారత బృందం డిప్యూటీ చెఫ్‌ డి మిషన్‌ అంజలీ భగవత్‌ వెల్లడించింది. ఇక, పురుషుల బృందానికి పతాకధారి ఎవరన్నది శనివారం ఉదయం ప్రకటిస్తామని భగవత్‌ తెలిపింది. ఈ క్రీడల్లో నీరూ ధాండా.. రెండు స్వర్ణాలు, ఓ రజతం గెలిచిన సంగతి తెలిసిందే. తన పోటీలు ముగియడంతో ఇప్పటికే భారత్‌ చేరిన నీరూ ధాండా.. మళ్లీ శనివారం ఉదయమే నగోయ రానుంది.

Updated Date - Oct 03 , 2026 | 01:10 AM