Share News

మళ్లీ రెండే

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:36 AM

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా లోజాన్‌ డైమండ్‌ లీగ్‌ను రెండోస్థానంతో ముగించాడు. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్న నీరజ్‌కు...

మళ్లీ రెండే

నీరజ్‌కు రెండోస్థానం

లంక త్రోయర్‌ పథిరగేదే టైటిల్‌

లోజాన్‌: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా లోజాన్‌ డైమండ్‌ లీగ్‌ను రెండోస్థానంతో ముగించాడు. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్న నీరజ్‌కు ఇక్కడా శ్రీలంక స్టార్‌ రుమేశ్‌ పథిరగే షాకిచ్చాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ పోటీల్లో నీరజ్‌ ఈటెను 88.05 మీటర్ల దూరం విసిరాడు. అయితే నీరజ్‌ కన్నా తొమ్మిది సెంటీ మీటర్లు ఎక్కువగా అంటే.. 88.14 మీటర్ల దూరాన్ని 23 ఏళ్ల పథిరగే నమోదు చేసి ఈ లీగ్‌ విజేతగా నిలిచాడు. గ్రెనెడాకు చెందిన ఆండర్సన్‌ పీటర్స్‌ (86.14 మీ.) మూడో స్థానంలో నిలిచాడు.

Updated Date - Aug 23 , 2026 | 05:36 AM