Share News

నటుడే కాదు.. షూటర్‌ కూడా..

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:11 AM

దివంగత నటుడు నానా పటేకర్‌లో ఓ క్రీడాకారుడు కూడా ఉ న్నాడు. ఆయన జాతీయస్థాయి షూ టింగ్‌లో పతకం కూడా సాధించారు.

నటుడే కాదు.. షూటర్‌ కూడా..

  • కోహ్లీకి వీరాభిమాని

  • నానా పటేకర్‌కు క్రికెటర్ల నివాళి

న్యూఢిల్లీ: దివంగత నటుడు నానా పటేకర్‌లో ఓ క్రీడాకారుడు కూడా ఉ న్నాడు. ఆయన జాతీయస్థాయి షూ టింగ్‌లో పతకం కూడా సాధించారు. ఇక, క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీకి వీరాభిమాని కూడా. కార్డియాక్‌ అరె్‌స్టతో 75 ఏళ్ల నానా పటేకర్‌ గురువా రం మరణించారు. ఓ సినిమా కోసం ఆయన మిలటరీ శిక్షణ తీసుకొంటున్న సమయంలో షూటింగ్‌ ప ట్ల ఆకర్షితుడయ్యారు. క్రమంగా ఆటపై దృష్టి కేంద్రీకరించిన పటేకర్‌ 2004లో ఇండోర్‌లో జరిగిన జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో రజతం నెగ్గారు. ఇక, 2007లో 300 మీ. బిగ్‌ బోర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం అందు కున్న మహారాష్ట్ర జట్టులో నానా సభ్యుడు. ఇక క్రికె టర్లలో కోహ్లీ అంటే ఎంతో ఇష్టం. అతడు త్వరగా అవుటైతే ఆ రోజు తాను అన్నం తినేవాడిని కాదని ఓ ఇంటర్వ్యూలో పటేకర్‌ చెప్పారు.

క్రికెటర్ల నివాళి..: నానాకు క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, కోహ్లీ, శిఖర్‌ ధవన్‌ నివాళులర్పించారు. ‘భారత సినిమాకు నిజమైన దిగ్గజం’ అని విరాట్‌ ఎక్స్‌లో సంతాప సందేశాన్ని పోస్ట్‌ చేశాడు. ‘నానా మరణవార్త విని ఎంతో బాధపడ్డా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు.

Updated Date - Oct 09 , 2026 | 01:12 AM