టీమిండియానే బెస్ట్.. పాక్ కోచ్ ప్రశంసలు
ABN , Publish Date - Jul 02 , 2026 | 09:38 PM
ప్రస్తుతం ప్రపంచంలో టీమిండియానే ది బెస్ట్ టీం అని పాక్ క్రికెట్ కోచ్ హెస్సన్ అన్నాడు. అయితే, తన మార్గదర్శకత్వంలో పాక్ టీం కూడా మంచి పురోగతి సాధించిందని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ప్రస్తుతం తిరుగులేని జట్టుగా అవతరించిందని పాక్ పరిమిత ఓవర్ల జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలో ఏ జట్టుకైనా భారత్‌తో సవాలేనని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ప్రమాణాలను అందుకునేందుకు అన్ని జట్లు ఇబ్బంది పడుతున్నాయని చెప్పాడు. పాక్ జట్టు ప్రదర్శనపై విమర్శలు తగవని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాక్ ప్రదర్శనను కేవలం భారత్ కోణంలో విశ్లేషించకూడదని అన్నాడు. ప్రస్తుతం టీమిండిచా ఉచ్చస్థితిలో ఉందని చెప్పాడు.
2025 ఆసియా కప్‌లో భారత్‌తో ఆడిన మ్యాచ్‌లు మినహా పాక్ అన్ని మ్యాచ్‌లు గెలిచిందని హెస్సన్ గుర్తు చేశాడు. పాక్ ప్రదర్శన మెరుగైందనేందుకు ఇది నిదర్శనమని అన్నాడు. తన సారథ్యంలో పాక్ ఎంతో మెరుగైన స్థితిలో ఉందని చెప్పాడు. ఐసీసీ ప్రధాన టోర్నీల్లో విజయాన్ని ఆశించే ముందు నిరంతరం మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నించాలని అభిప్రాయపడ్డాడు.
హెస్సన్ రాక తరువాత పాక్ ప్రదర్శన మెరుగైంది. వైట్ బాల్ క్రికెట్‌లో పలు విజయాలను అందుకుంది. రెండు టీ20 ట్రైసిరీస్‌లల్లో గెలిచింది. 6 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లల్లో కేవలం ఒక్క టోర్నీలోనే ఓటమి చవిచూసింది. అయితే, ఆసియా కప్‌లో భారత్‌తో తలపడిన మూడు సందర్భాల్లోనూ పాక్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..
మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..