నొస్కోవ్ఠా ముచోవా
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:24 AM
వింబుల్డన్ మహిళల సింగిల్స్ కొత్త చాంపియన్ ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. శనివారం జరిగే ఫైనల్లో...
రా. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
వింబుల్డన్
లండన్ : వింబుల్డన్ మహిళల సింగిల్స్ కొత్త చాంపియన్ ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. శనివారం జరిగే ఫైనల్లో ఇద్దరు చెక్ రిపబ్లిక్ తారలు తొమ్మిదో సీడ్ లిండా నొస్కోవా, 11వ సీడ్ కరోలినా ముచోవా తలపడనున్నారు. గ్రాస్ కోర్టులపై ఆడడంలో ముచోవా సిద్ధహస్తురాలు. మరోవైపు శక్తివంతమైన సర్వీసులకు నొస్కోవా పెట్టింది పేరు. వీరిద్దరు గతంలో ఒకసారే పరస్పరం ఢీకొన్నారు. 2025 యూఎస్ ఓపెన్ మూడో రౌండ్‌లో నొస్కోవాపై ముచోవా గెలిచింది.