100 మీ. రేస్‌లో బోల్ట్ తర్వాత జాకబ్స్
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:50 AM
సర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ (ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా) తర్వాత ఫాస్టెస్ట్ రన్నర్‌గా మాజీ ఒలింపిక్ చాంపియన్ లామోంట్ మార్సెల్ జాకబ్స్ నిలిచాడు...
రెండో ఫాస్టెస్ట్ టైమింగ్
న్యూఢిల్లీ: సర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ (ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా) తర్వాత ఫాస్టెస్ట్ రన్నర్‌గా మాజీ ఒలింపిక్ చాంపియన్ లామోంట్ మార్సెల్ జాకబ్స్ నిలిచాడు. ఆస్ట్రియా ఓపెన్ 100 మీ. రేస్‌లో ఇటలీ రన్నర్ లామోంట్ 9.67 సెకన్ల టైమింగ్‌తో రేస్‌ను పూర్తి చేశాడు. ఈ క్రమంలో బోల్ట్ 9.58 రికార్డు తర్వాత వేగంగా రేస్‌ను పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే, అనుమతించిన దానికంటే గాలి వాలు ఎక్కువగా ఉండడంతో జాకబ్స్ రికార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదు.
ఈ వార్తలనూ చదవండి:
వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..
మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..