Share News

కుశాల్‌కే టెస్టు పగ్గాలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:08 AM

శ్రీలంక క్రికెట్‌ పూర్తి స్థాయి కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌ నియమితుడయ్యాడు. ఇప్పటికే వన్డే, టీ20ల సారథిగా ఉన్న అతడికి..

కుశాల్‌కే టెస్టు పగ్గాలు

  • శ్రీలంక క్రికెట్‌

కొలంబో: శ్రీలంక క్రికెట్‌ పూర్తి స్థాయి కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌ నియమితుడయ్యాడు. ఇప్పటికే వన్డే, టీ20ల సారథిగా ఉన్న అతడికి శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) తాజాగా టెస్టు ఫార్మాట్‌ బాధ్యతలు కూడా అప్పగించింది. ధనంజయ డి సిల్వ టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో ఎస్‌ఎల్‌సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఆటగాడిగా మాత్రం జట్టుకు అందుబాటులో ఉంటానని డి సిల్వ పేర్కొన్నాడు. ఇప్పటికే పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు అక్కడ వచ్చేనెలలో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఇక మెండిస్‌ 75 టెస్టుల్లో 10 సెంచరీలతో 4836 పరుగులు సాధించాడు.

Updated Date - Oct 09 , 2026 | 01:10 AM