Russian Grandmaster Vladimir Kramnik: ఫిడేపై క్రామ్నిక్ పరువునష్టం దావా
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:50 AM
వివాదాస్పద రష్యన్ గ్రాండ్ మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడేపై పరువునష్టం దావా వేశాడు. లాసన్నేలోని స్విస్ సివిల్ కోర్టులో ....
న్యూఢిల్లీ: వివాదాస్పద రష్యన్ గ్రాండ్ మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడేపై పరువునష్టం దావా వేశాడు. లాసన్నేలోని స్విస్ సివిల్ కోర్టులో అతడు కేసు దాఖలు చేశాడు. అమెరికా జీఎం డేనియల్ నరోడిట్‌స్కీ హఠాన్మరణం తర్వాత క్రామ్నిక్ చెస్ ఆటగాళ్లపై పలు కామెంట్లు చేశాడు. ఆన్‌లైన్ టోర్నీలో మోసాలకు పాల్పడుతున్నారంటూ పలుమార్లు ఆరోపణలు కూడా చేశాడు. అతడి తీరుతో అనేక మంది ప్లేయర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో క్రామ్నిక్‌పై చర్యలు తీసుకోవాలని వేలాది మంది సంతకాలతో ఫిర్యాదులు కూడా వచ్చాయి. గతేడాది నవంబరులో క్రామ్నిక్‌పై ఫిడే అధికారికంగా ఫిర్యాదును నమోదు చేసింది. దీనికి కౌంటర్‌గా తనను అప్రతిష్ట పాల్జేస్తున్నారని ఆరోపిస్తూ క్రామ్నిక్ సివిల్ కేసు వేశాడు.