కశ్మీర్‌లో కూడా ఆడిస్తారా..?
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:06 AM
ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలన్న తన నిర్ణయం ఆవేశంతో తీసుకున్నది కాదని భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తెలిపింది....
‘ఫిడే’ని నిలదీసిన హంపి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలన్న తన నిర్ణయం ఆవేశంతో తీసుకున్నది కాదని భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతాపరంగా సైప్రస్‌లో ఆడడం సరైంది కాదన్న ఆలోచనతోనే తన నిర్ణయం ప్రకటించానంది. సైప్రస్‌లో టోర్నీ నిర్వహించడం సరైదని భావిస్తే.. జమ్మూ కశ్మీర్‌లాంటి ప్రదేశాల్లో కూడా ఆడించగలరా? అని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే)ను హంపి ప్రశ్నించింది. కశ్మీర్‌ను లెవెల్-3 (ప్రమాదకర) ప్రాంతంగా భావిస్తారనీ, ఇప్పుడు సైప్రస్ కూడా అలాంటి పరిస్థితిలోనే ఉందంది. తనపై జరిమానా విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
హంపి స్థానంలో ముజిచుక్: హంపి వైదొలగడంతో ఆమె స్థానంలో ఉక్రెయిన్ క్రీడాకారిణి అన్నా ముజిచెక్‌కు టోర్నీలో చోటు దక్కింది. కాగా హంపి దూరమవడంతో ఇప్పుడు టోర్నీలో భారత్ నుంచి అన్నాచెల్లెళ్లు ప్రజ్ఞానంద, వైశాలి, ప్రపంచకప్ విజేత దివ్యా దేశ్‌ముఖ్ మాత్రమే బరిలో నిలిచారు.
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం