కోమల్‌కు కాంస్యం
ABN , Publish Date - May 12 , 2026 | 02:38 AM
ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పలో భారత అమ్మాయి కోమల్ కోహర్ కాంస్యం సాధించింది....
గాంధీనగర్: ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పలో భారత అమ్మాయి కోమల్ కోహర్ కాంస్యం సాధించింది. సోమవారం జరిగిన మహిళల 48 కిలోల విభాగంలో టోక్యో రజత పతక విజేత మీరాబాయి చాను స్థానంలో బరిలోకి దిగిన కోమల్ 177 (78+99) కిలోల బరువెత్తి మూడో స్థానం దక్కించుకొంది. చైనీస్ తైపీకి చెందిన హుయాంగ్ యి చెన్ (193 కిలోలు) స్వర్ణం, ఫాంగ్ వాంగ్ లింగ్ (192 కిలోలు) రజతం సొంతం చేసుకొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?
భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్