కాకతీయ నైట్స్ శుభారంభం
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:04 AM
ఆర్చరీ ప్రీ మియర్ లీగ్ (ఏపీఎల్) రెండో అంచెలో కాకతీయ నైట్స్ శుభా రంభం చేసింది.
ఆర్చరీ ప్రీమియర్ లీగ్
హైదరాబాద్: ఆర్చరీ ప్రీ మియర్ లీగ్ (ఏపీఎల్) రెండో అంచెలో కాకతీయ నైట్స్ శుభా రంభం చేసింది. మైటీ మరా ఠాస్‌తో జరిగిన ఈ పోరులో ఇరుజట్లూ చెరో 4 పాయింట్లతో సమంగా నిలవడంతో.. ఫలితం షూటాఫ్‌కు దారితీసింది. షూటాఫ్ లో కాకతీయ విజయం సాధించింది. ఇక డిఫెండింగ్ చాంప్ రాజ్‌పుతాన రాయల్స్ కూడా విజయంతో మొదలెట్టింది. గురువారం ఉత్కంఠగా సాగిన ఆరంభ మ్యాచ్‌లో రాయల్స్ 5-3తో పృథ్వీరాజ్ యోధాస్‌ను ఓ డించింది. కాగా, ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలతో అదరగొట్టిన తెలంగాణ ఆర్చర్ చికిత జట్టు చోళ చీఫ్స్ 3-5తో చీరో ఆర్చర్స్ చేతిలో ఓడింది.