సానియా రికార్డును దాటేసి..14 ఏళ్ల జెన్సీ సంచలనం
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:26 AM
భారత టెన్నిస్ వర్ధ మాన క్రీడాకారిణి జెన్సీ కనాబర్ సంచలనం సృష్టించింది. గుజరాత్‌కు చెందిన జెన్సీ (14 ఏళ్ల 11 నెలలు).. ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ ఫైనల్ చేరిన భారత పిన్న వయస్కురాలిగా..
కోల్‌కతా: భారత టెన్నిస్ వర్ధ మాన క్రీడాకారిణి జెన్సీ కనాబర్ సంచలనం సృష్టించింది. గుజరాత్‌కు చెందిన జెన్సీ (14 ఏళ్ల 11 నెలలు).. ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ ఫైనల్ చేరిన భారత పిన్న వయస్కురాలిగా సానియా మీర్జా పేరిటనున్న రికార్డును అధిగమించింది. ఇక్కడ జరుగుతున్న ఐటీఎఫ్ డబ్ల్యూ-15 టోర్నీ సెమీస్‌లో జెన్సీ 6-1, 6-0తో ఫ్లోరెంటీన్ డికెర్స్ (నెదర్లాండ్స్)ను ఓడించింది. 2002లో హైదరాబాద్ వేదికగా ఐటీఫ్ సింగిల్స్‌లో సానియా మీర్జా (15 ఏళ్ల 10 నెలలు) ఫైనల్ చేరింది. ఈ రికార్డును జెన్సీ దాటేసింది.