జస్పాల్ తల్లి మృతి
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:21 AM
లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకొంది. రాణా మృతిచెందిన నాలుగురోజులకే అతని తల్లి శ్యామాదేవి...
రాణా మరణించిన నాలుగు రోజుల్లోపే
న్యూఢిల్లీ: లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకొంది. రాణా మృతిచెందిన నాలుగురోజులకే అతని తల్లి శ్యామాదేవి (78) మరణించారు. కొన్నాళ్లుగా ఆమె కేన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే కుమారుడి మృతి తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. శ్యామాదేవి భర్త ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ఉత్తరాఖండ్ మాజీ మంత్రి నారాయణ్ సింగ్ రాణా.