జొకోకు మళ్లీ నిరాశ
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:25 AM
ర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కల నెరవేరలేదు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న నొవాక్‌కు మరోసారి నిరాశ తప్పలేదు....
సెమీస్‌లో ఓటమిఫ ఫైనల్లో సినర్
జ్వెరెవ్‌తో అమీతుమీ
లండన్ : సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కల నెరవేరలేదు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న నొవాక్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. వింబుల్డన్ సెమీఫైనల్లో 39 ఏళ్ల జొకోకు పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన రెండో సెమీ్‌సలో డిఫెండింగ్ చాంపియన్ సినర్ 6-4, 6-4, 6-4తో వరుస సెట్లలో నొవాక్‌ను ఓడించాడు. ఆదివారం జరిగే తుదిపోరులో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సినర్ తలపడతాడు. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో రెండో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)7-6 (0), 6-2, 6-4తో బ్రిటన్‌కు చెందిన అర్ధుర్ ఫెరీని చిత్తు చేశాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో జ్వెరెవ్‌కిది తొలి ఫైనల్. కాగా..అతడు గత మేలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకున్నాడు.