Share News

సలీమా కెప్టెన్సీలో.. ఆస్ట్రేలియాకు భారత హాకీ జట్టు

ABN , Publish Date - May 19 , 2026 | 01:12 AM

ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల హాకీ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు మిడ్‌ఫీల్డర్‌ సలీమా టేటె కెప్టెన్‌గా...

సలీమా కెప్టెన్సీలో.. ఆస్ట్రేలియాకు భారత హాకీ జట్టు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల హాకీ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు మిడ్‌ఫీల్డర్‌ సలీమా టేటె కెప్టెన్‌గా వ్యవహరించనుంది. డిఫెండర్‌ లాల్‌తన్‌తున్‌గ్లీ తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ సిరీ్‌సలో భాగంగా ఆతిథ్య జట్టుతో మన మహిళలు నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నారు. తొలి రెండు మ్యాచ్‌లు ఈనెల 26, 27 తేదీల్లో మిగిలిన రెండు 29, 30న జరుగుతాయి.

ఈ వార్తలనూ చదవండి:

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 19 , 2026 | 01:12 AM