Share News

4 X 100 రిలే మహిళలకు స్వర్ణం

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:48 AM

ఆసియా రిలే చాంపియన్‌షి్‌పలో భారత మహిళల బృందం 4 X100 రిలే స్వర్ణాన్ని సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో...

4 X 100 రిలే మహిళలకు స్వర్ణం

షావోజింగ్స్‌ (చైనా): ఆసియా రిలే చాంపియన్‌షి్‌పలో భారత మహిళల బృందం 4 X100 రిలే స్వర్ణాన్ని సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో స్రబాని నంద, ఎస్‌ఎస్‌ స్నేహ, సుధేష్ణ శివాంకర్‌, తమన్నాలతో కూడిన భారత జట్టు 43.85 సెకన్ల టైమింగ్‌తో టాప్‌లో నిలిచింది. కాగా, భారత జట్లకు మిక్స్‌డ్‌ 4గీ400లో రజతం, మిక్స్‌డ్‌ 4గీ100లో కాంస్యం దక్కాయి. తీర్థ శెట్టి, పూవమ్మ, భరత్‌ శ్రీధర్‌, నీరూ పాఠక్‌లతో కూడిన జట్టు 4 X400లో 3 నిమిషాల 17.06 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇక, ప్రణవ్‌, తమన్నా, అనిమేష్‌, స్నేహ బృందం మిక్స్‌డ్‌ 4గీ100లో 41.27 సెకన్ల టైమింగ్‌లో కాంస్యం సాధించింది. పురుషుల 4 X 400 రిలే జట్టు ఐదో స్థానంలో, మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...

Updated Date - Jun 22 , 2026 | 05:48 AM