Share News

చైనాకు చెక్‌

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:42 AM

అనూహ్య ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు.. వరల్డ్‌కప్‌ను డ్రాతో ఆరంభించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-డి పోరులో ఒలింపిక్‌ రజత పతక విజేత చైనాను భారత్‌...

చైనాకు చెక్‌

భారత అమ్మాయిల పోరు 2-2తో డ్రా

మహిళల హాకీ ప్రపంచకప్‌

అమ్‌స్టెల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): అనూహ్య ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు.. వరల్డ్‌కప్‌ను డ్రాతో ఆరంభించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-డి పోరులో ఒలింపిక్‌ రజత పతక విజేత చైనాను భారత్‌ 2-2తో నిలువరించింది. భారత జట్టులో నవ్‌నీత్‌ (8వ నిమిషం), దీపిక (26వ) గోల్స్‌ సాధించగా.. చైనా తరఫున జాంగ్‌ యింగ్‌ (14వ), మా నింగ్‌ (39వ) గోల్స్‌ చేశారు. మ్యాచ్‌లో చైనా ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. మన అమ్మాయిలు వ్యూహాత్మకంగా ఆడి ప్రత్యర్థిని కట్టడి చేశారు. గ్రూప్‌-డి మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4-0తో దక్షిణాఫ్రికాను ఓడించింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది.

Updated Date - Aug 17 , 2026 | 05:42 AM