Share News

ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాం

ABN , Publish Date - Aug 12 , 2026 | 05:16 AM

నేషన్స్‌ కప్‌లో విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ సలీమా టెటే చెప్పింది. అదే ఉత్సాహంతో...

ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాం

మహిళల హాకీ కెప్టెన్‌ సలీమా

న్యూఢిల్లీ: నేషన్స్‌ కప్‌లో విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ సలీమా టెటే చెప్పింది. అదే ఉత్సాహంతో వరల్డ్‌క్‌పలోనూ పతకం సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. చైనా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లున్న గ్రూప్‌-డిలో భారత్‌ ఆడనుంది. ‘ఈసారి వరల్డ్‌కప్‌ మాదే. దూకుడుతోపాటు వ్యూహాత్మకంగా ఆడి పతకం కొల్లగొడతాం. జట్టుపై పూర్తి విశ్వాసం ఉంద’ని టెటే చెప్పింది. సహచరులు కూడా ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలని సూచించింది.

Updated Date - Aug 12 , 2026 | 05:16 AM