Share News

ఓవరాల్‌ చాంపియన్‌ భారత్‌

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:16 AM

కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ పోటీలలో భా రత్‌ మొదటిసారి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ దక్కించుకుంది. నైజీరియాలోని...

ఓవరాల్‌ చాంపియన్‌ భారత్‌

కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ పోటీలలో భా రత్‌ మొదటిసారి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ దక్కించుకుంది. నైజీరియాలోని లాగో్‌సలో జరిగిన చాంపియన్‌షి్‌పలో మనోళ్లు మొత్తం 35 పతకాలు కొల్లగొట్టారు. అండర్‌-23, సీనియర్‌ విభాగాలలో కలిపి 13 స్వర్ణ, ఎనిమిది రజత, 14 కాంస్య పతకాలు సాధించారు. పోటీల నాలుగో, చివరి రోజు..భారత సీనియర్‌ ఫెన్సర్లు పురుషుల సబ్రే, మహిళల సబ్రే, పురుషుల ఎపీ, మహిళల ఎపీ, మహిళల ఫాయిల్‌ విభాగాలలో ఐదు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల ఫాయిల్‌లో రజతం నెగ్గారు. ఈ ప్రదర్శన దరిమిలా భారత్‌ ‘విల్కిన్‌సన్‌ సోర్డ్‌’ ట్రోఫీ అందుకుంది. ‘తొలిసారి కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ ఓవరాల్‌ చాంపియన్‌షి్‌ప చేజిక్కించుకోవడం భారత ఫెన్సర్ల సత్తా, క్రమశిక్షణ, కఠోర శ్రమకు అద్దం పడుతుంది’ అని భారత ఫెన్సింగ్‌ సంఘం సెక్రెటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా పేర్కొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 05:16 AM