భారత్..హ్యాట్రిక్
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:18 AM
దీపిక డబుల్ ధమాకాతో.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని భారత మహిళల హాకీ జట్టు వరుసగా మూడోసారి సొంతం చేసుకొని హ్యాట్రిక్ కొట్టింది.
మనమ్మాయిలదే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
ఫైనల్లో చైనా చిత్తు
భోపాల్: దీపిక డబుల్ ధమాకాతో.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని భారత మహిళల హాకీ జట్టు వరుసగా మూడోసారి సొంతం చేసుకొని హ్యాట్రిక్ కొట్టింది. శనివారం జరిగిన ఫైనల్లో డబుల్ డిఫెండింగ్ చాంప్ భారత్ 3-1తో ఒలింపిక్ రజత పతక విజేత చైనాను చిత్తు చేసింది. టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్.. రికార్డు స్థాయిలో నాలుగోసారి టైటిల్‌ను దక్కించుకొంది. దీపిక (38వ, 43వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. ఇషిక (42వ) ఓ గోల్ కొట్టింది. చైనా ప్లేయర్ యూజున్ చెన్ (25వ) ఫీల్డ్ గోల్ చేసింది. కాగా, మూడో స్థానం పోరులో జపాన్ 5-2తో మలేసియాను ఓడించి కాంస్య పతకం అందుకొంది.