Share News

హైదరాబాద్‌ చేరిన క్రికెటర్లు

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:03 AM

భారత, వెస్టిండిస్‌ క్రికెటర్లు హైదరాబాద్‌ చేరుకున్నారు. బుధవారం ఉప్పల్‌ వేదికగా ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 జరగనున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ చేరిన క్రికెటర్లు

  • రేపే విండీ‌స్‌తో భారత్‌ నాలుగో టీ20

శంషాబాద్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి ): భారత, వెస్టిండిస్‌ క్రికెటర్లు హైదరాబాద్‌ చేరుకున్నారు. బుధవారం ఉప్పల్‌ వేదికగా ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. ఇండోర్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన క్రికెటర్లు.. సోమవారం మధ్యాహ్నం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టారు. టీమిండియా కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌తో పాటు జట్టు సభ్యులు సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ, సూర్యవంశీ, అర్ష్‌దీ‌ప్‌లు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రాగానే అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. అనంతరం భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య ఆటగాళ్లంతా తాము బస చేసే హోటళ్లకు బయలుదేరారు.

Updated Date - Oct 13 , 2026 | 05:04 AM