Share News

ప్రయోగాలుంటాయా?

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:16 AM

వెస్టిండీ్‌సపై తొలి రెండు వన్డేల్లో ఘన విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు క్లీన్‌స్వీ్‌పపై దృష్టి సారించింది. శనివారం ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో మ్యాచ్‌ జరుగనుంది.

ప్రయోగాలుంటాయా?

  • క్లీన్‌ స్వీప్ పై భారత్‌ దృష్టి

  • ఓదార్పు కోసం విండీస్‌

  • నేడు మూడో వన్డే

  • మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

ముల్లన్‌పూర్‌: వెస్టిండీ్‌సపై తొలి రెండు వన్డేల్లో ఘన విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు క్లీన్‌స్వీ్‌పపై దృష్టి సారించింది. శనివారం ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో మ్యాచ్‌ జరుగనుంది. అటు పర్యాటక విండీస్‌ ఎంతగా పోరాడినా విజయం మాత్రం దక్కడం లేదు. బ్యాటర్లు ఫర్వాలేదనిపిస్తున్నా బౌలర్లు మాత్రం ధారాళంగా పరుగులిచ్చుకోవడంతో ఓటములు తప్పడం లేదు. దీంతో చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పొట్టి ఫార్మాట్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనుకుంటోంది.

ఊపు మీదున్న భారత్‌: గువాహటి వన్డేలో ఏకంగా 406 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌ మహా జోరు మీదుంది. మిడిలార్డర్‌ పెద్దగా రాణించకపోయినా టాపార్డర్‌ భీకర ఫామ్‌ ముందు విండీస్‌ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. తొలి మ్యాచ్‌లోనూ 296 పరుగులను అవలీలగా ముగించింది. కెప్టెన్‌ గిల్‌ సెంచరీ, డబుల్‌ సెంచరీలతో అసాధారణ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇక వెటరన్లు విరాట్‌, రోహిత్‌ కూడా పోటాపోటీ ప్రదర్శనలతో ఒక్కో శతకం సాధించడం విశేషం. అయితే ఈ నామమాత్రపు మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలు చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్‌గా రోహిత్‌కు విశ్రాంతినిచ్చి యువ బ్యాటర్‌ జైస్వాల్‌ను, అలాగే పెద్దగా రాణించని రుతురాజ్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ను తీసుకునే అవకాశం ఉంది. బౌలింగ్‌లో సిరాజ్‌కు ఇప్పటిదాకా స్థానం దక్కలేదు. గాయంతో దూరమైన ప్రసిద్ధ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన అన్షుల్‌ను కూడా పరీక్షించవచ్చు.


తుది జట్లు (అంచనా)

భారత్‌: గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌/జైస్వాల్‌, విరాట్‌, రుతురాజ్‌/జురెల్‌, రాహుల్‌, జడేజా, నమన్‌, నితీశ్‌/సిరాజ్‌, అన్షుల్‌/నబీ, కుల్దీప్‌, బ్రార్‌.

వెస్టిండీస్‌: క్యాంప్‌బెల్‌, కార్టీ/ఆండ్రూ, హోప్‌ (కెప్టెన్‌), జాంగూ, చేజ్‌, రూథర్‌ఫోర్డ్‌, పాల్‌, జోసెఫ్‌, షామార్‌, సీల్స్‌, మోటీ.

Updated Date - Oct 03 , 2026 | 01:17 AM