Share News

IND vs SL: ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే

ABN , Publish Date - Aug 17 , 2026 | 10:52 AM

శ్రీలంక , భారత్‌ జట్ల మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్‌ నైట్‌ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది.

IND vs SL: ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే

స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంక, భారత్‌ (IND vs SL) జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్‌ నైట్‌ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది. చివరి వికెట్‌గా ప్రసిద్ధ్‌ కృష్ణ (2) పెవిలియన్‌కు చేరడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌కు ముగిసింది. టీమిండియా బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్(167) అద్భుత శతకంతో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్(82), ధ్రువ జురెల్ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. రిషబ్ పంత్ 39, యశస్వి జైస్వాల్ 31 పరుగులు చేయగా.. మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు.


అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ నిషాన్ ఫెర్నాండో (0)ను సిరాజ్‌ ఔట్ చేశాడు. రెండో బంతికే స్లిప్‌లో ఉన్న పడిక్కల్‌కు నిషాన్ క్యాచ్‌ ఇచ్చాడు. అలానే 7.1 ఓవర్లో 27 పరుగుల వద్ద దినేష్ చండిమల్(4) ఔటయ్యాడు. మానవ సుతార్ బౌలింగ్‪లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గత రెండు రోజులు వర్షం కారణంగా దాదాపు 60 ఓవర్ల వరకూ ఆట రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ ఓ పావుగంట ముందుగానే మ్యాచ్‌ మొదలైంది. తొలి ఓవర్‌లోనే వికెట్‌ను కోల్పోయిన శ్రీలంక ఆ షాక్‌ నుంచి కాస్త తేరుకుంది. బ్యాటర్లు ఉదారా (22*), మెండీస్ (11*) మరో వికెట్‌ పడనీయకుండా ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 47/2.

Updated Date - Aug 17 , 2026 | 10:54 AM