Share News

ఫిలిప్స్, హెన్రీ సెంచరీలు... తొలి ఇన్నింగ్స్‌ న్యూజిలాండ్ 368 ఆలౌట్

ABN , Publish Date - Nov 20 , 2026 | 08:34 AM

ల్లింగ్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లు హెన్రీ నికోల్స్‌(175), గ్లెన్ ఫిలిప్స్‌(118) భారీ సెంచ‌రీల‌తో రాణించారు.

ఫిలిప్స్, హెన్రీ సెంచరీలు... తొలి ఇన్నింగ్స్‌ న్యూజిలాండ్ 368 ఆలౌట్
IND vs NZ Test

స్పోర్ట్స్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. కివీస్ జట్టు ఆరంభంలో తడబడినప్పటికీ హెన్రీ నికోల్స్‌(175), గ్లెన్ ఫిలిప్స్‌(118) భారీ సెంచ‌రీల‌తో క‌దం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగుల చేయగలిగింది. ఓవర్‌ నైట్ 243/5 స్కోరుతో రెండో రోజు ఆటను మొదలుపెట్టిన కివీస్.. మరో 125 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా 4, ఆకాశ్‌ దీప్ 3, అన్షుల్ కాంబోజ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత న్యూజిలాండ్ ను బ్యాటింగ్ అహ్హ‌నించింది. చక్కటి స్వింగ్, బౌన్స్‌తో ఉన్న బేసిన్‌ రిజర్వ్‌ పిచ్‌ ఆరంభంలో బౌలర్లకు బాగా అనుకూలించింది. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే కివీస్ జట్టుకు షాక్‌ తగిలింది. బుమ్రా వేసిన మూడో బంతిని కివీస్ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (0) వదిలేయగా, బంతి లోపలికి దూసుకొచ్చి స్టంప్స్‌ను పడగొట్టింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కాన్వే (4)ను కంబోజ్‌ పెవిలియన్‌కు చేరాడు. రచిన్‌ రవీంద్ర (15) వికెట్‌ ఆకాశ్‌దీప్‌ ఖాతాలో చేరింది.


కొంత విరామం తర్వాత తిరిగొచ్చిన‌ బుమ్రా తన మొదటి ఓవర్లోనే మిచెల్‌ (1) ఆట ముగించాడు. లంచ్‌ తర్వాత బ్లన్‌డెల్‌ (5) కూడా అవుట్‌ కావడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఈ దశలో నికోల్స్, ఫిలిప్స్‌ సమన్వయంతో ఆడుతూ జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 118 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫిలిప్స్ ఔటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా..మరోవైపు హెన్రీ భారత్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ 175 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Updated Date - Nov 20 , 2026 | 08:51 AM