Share News

దూకుడుగా ఆడుతున్న సంజూ శాంసన్! భారత్ స్కోరు ఎంతంటే..

ABN , Publish Date - Mar 05 , 2026 | 07:34 PM

ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది. అభిషేక్ శర్మ త్వరగా ఔటైనా సంజూ శాంసన్ దూకుడుగా ఆడుతూ భారత్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 67-1

దూకుడుగా ఆడుతున్న సంజూ శాంసన్! భారత్ స్కోరు ఎంతంటే..
Ind Vs Eng T20 Semi Finals

ఇంటర్నెట్ డెస్క్: వాంఖడే స్టేడియంలో నేడు ఇంగ్లండ్‌తో తలపడుతున్న భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్‌గా రంగంలోకి దిగిన సంజు శాంసన్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌లో సిక్స్, ఫోర్‌ను రాబట్టాడు. సంజూ బాటలోనే దూకుడుగా ప్రారంభించిన అభిషేక్ రెండో ఓవర్‌లో విల్ జాక్స్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు సాధించాడు. ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నంలో ఫిల్ సాల్ట్‌కు చిక్కి 9 పరుగుల స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో, భారత్‌ 20 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.


ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్‌తో కలిసి సంజూ దూకుడును కొనసాగించాడు. అయితే, మూడో ఓవర్‌లో సంజూ శాంసన్‌కు లైఫ్ దక్కింది. జొఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో సంజూ కొట్టిన బంతిని కెప్టెన్ హ్యారీ బ్రూక్ జారవిరచడంతో టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సంజూ శాంసన్ సందర్భోచితంగా బౌండరీలు రాబడుతుంటే మరో వైపు ఇషాన్ కూడా దూకుడుగా ఆడటంతో భారత్ స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. ఆరు ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో సంజూ(41) , ఇషాన్ (16) కొనసాగుతున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 07:39 PM