ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టీ20.. టాస్ గెలిచిన ఇంగ్లండ్
ABN , Publish Date - Mar 05 , 2026 | 06:39 PM
భారత్‌తో నేడు జరుగుతున్న టీ20 సెమీస్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో, భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్, భారత్ మధ్య మరో చరిత్రాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా రెండు జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్న నేపథ్యంలో ఇండియా అభిమానుల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యరీ బ్రూక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో, భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్) ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్ జట్టు: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్) , జాకబ్ బెతెల్, టామ్ బాంటన్, శామ్ కరన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్
సూపర్ 8 దశలో గ్రూప్ 1 నుంచి మొదట ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక గ్రూప్ 2లో భాగంగా సూపర్ - 8 దశలో తలపడ్డ డిఫెండింగ్ చాంపియన్ భారత్ మొదట్లో కొద్దిగా తడబడ్డా కోలుకుని సెమీస్‌కు చేరింది.
మరోవైపు, వాంఖడే స్టేడియం సెంటీమెంట్‌పై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సెమీస్‌లో గెలిచిన జట్టు చివరకు ట్రోఫీని సొంతం చేసుకుంటుందన్న నమ్మకం ఉండటంతో జనాల్లో ఆసక్తి పతాక స్థాయికి చేరుకుంది. ఇక వాంఖడేలో భారత్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండటంతో భారతీయ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ పిచ్ బ్యాటింగ్ అనుకూలం కావడంతో టాస్ గెలిచిన జట్టుకు సానుకూలంగా మారుతుందన్న అభిప్రాయం ఉంది.