Share News

ఇంగ్లండ్‌కు తలొగ్గారు..

ABN , Publish Date - Aug 18 , 2026 | 05:42 AM

డిఫెన్స్‌ తప్పిదాలతో ఆధిక్యాన్ని చేజార్చుకొన్న భారత పురుషుల జట్టు.. హాకీ వరల్డ్‌కప్‌లో ఓటమిని చవిచూసింది. గ్రూప్‌-డిలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-4తో...

ఇంగ్లండ్‌కు తలొగ్గారు..

భారత్‌కు పరాజయం

పురుషుల హాకీ ప్రపంచకప్‌

మహిళల పోరు నేడు భారత్‌ X దక్షిణాఫ్రికా

(సా. 6.30 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో)

అమ్‌స్టెల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): డిఫెన్స్‌ తప్పిదాలతో ఆధిక్యాన్ని చేజార్చుకొన్న భారత పురుషుల జట్టు.. హాకీ వరల్డ్‌కప్‌లో ఓటమిని చవిచూసింది. గ్రూప్‌-డిలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-4తో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పాలైంది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (17వ), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (25వ) చెరో గోల్‌ సాధించారు. ఇంగ్లండ్‌ తరఫున బాండురక్‌ (14వ, 55వ) రెండు, రష్‌మోర్‌ (39వ), హెన్రీ (43వ) చెరో గోల్‌ చేశారు. తొలి క్వార్టర్‌ చివర్లో నికోలస్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యం సాధించింది. కానీ, రెండో క్వార్టర్స్‌లో భారత్‌ మెరుపు దాడులతో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఈ క్రమంలో 16వ నిమిషంలో లభించిన పీసీని హర్మన్‌ప్రీత్‌ గోల్‌లోకి పంపగా.. 24వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీని దిల్‌ప్రీత్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ 2-1తో ముందుకెళ్లినా, తర్వాత ఇంగ్లండ్‌ విజృంభించి వరుసగా 3 గోల్స్‌ చేసింది. ఇక ఆడిన రెండు మ్యాచ్‌ల నుంచి 3 పాయింట్లు సాధించిన భారత్‌కు.. రెండోరౌండ్‌ చేరాలంటే బుధవారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ కీలకం కానుంది. ఈ పోరులో గెలిచినా లేదా కనీసం డ్రా చేసుకొన్నా భారత్‌ ముందంజ వేస్తుంది. ఒకవేళ ఓడితే హర్మన్‌ప్రీత్‌ సేన టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాగా, పాకిస్థాన్‌, వేల్స్‌ మధ్య మ్యాచ్‌ 3-3తో.. ఫ్రాన్స్‌, మలేసియా పోరు కూడా 3-3తో డ్రా అయ్యాయి.

Updated Date - Aug 18 , 2026 | 05:42 AM