Share News

వరల్డ్ కప్-2026: ఫైనల్‌లో శతక్కొట్టిన వైభవ్

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:38 PM

హరారే వేదికగా జరుగుతోన్న అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ లో యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ శతకంతో చెలరేగి ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై దండయాత్ర చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తుది పోరులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

వరల్డ్ కప్-2026: ఫైనల్‌లో శతక్కొట్టిన వైభవ్
Vaibhav Suryavanshi Century

స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 ప్రపంచ కప్(Under 19 World Cup) ఫైనల్‌లో ఇంగ్లాండ్ తో యువ భారత్ తలపడుతోంది. హరారే వేదికగా ఇవాళ(శుక్రవారం) జరుగుతున్న తుదిపోరులో టాస్ గెలిచిన టీమిండియా(India) బ్యాటింగ్‪కు దిగింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంగ్లీష్ బౌలర్లపై దండయాత్ర చేస్తున్నాడు. కేవలం 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ యువ హిట్టర్.. ఆ తర్వాత గేర్ మార్చి... మరింత స్పీడ్ తో బౌండరీలు బాదుతున్నాడు. ఈ క్రమంలో 55 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.

Updated Date - Feb 06 , 2026 | 02:38 PM