Share News

భవికా సారథ్యంలో..

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:10 AM

అండర్‌-19 మహిళల ఆసియాక్‌పలో పాల్గొనే భారత జట్టును శనివారం ప్రకటించారు. వచ్చే ఏడాది యూఏఈలో జరిగే ఈ టీ20 టోర్నీలో..

భవికా సారథ్యంలో..

న్యూఢిల్లీ: అండర్‌-19 మహిళల ఆసియాక్‌పలో పాల్గొనే భారత జట్టును శనివారం ప్రకటించారు. వచ్చే ఏడాది యూఏఈలో జరిగే ఈ టీ20 టోర్నీలో వికెట్‌ కీపర్‌ భవికా అహిరే నేతృత్వంలో భారత్‌ బరిలోకి దిగనుంది. మహిళల సెలెక్షన్‌ కమిటీ 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయగా, అనాడి తగ్డే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. రెండేళ్ల క్రితం తొలిసారిగా జరిగిన ఆసియాక్‌పలో భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. అలాగే వచ్చే ఏడాదే జరిగే అండర్‌-19 వరల్డ్‌క్‌పనకు ముందు ఈ టోర్నీ సన్నాహకంగా ఉపయోగపడనుంది.

Updated Date - Nov 29 , 2026 | 03:12 AM