Share News

ఫైనల్లో ముగ్గురు భారత అథ్లెట్లు

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:16 AM

ఇక్కడ ప్రారంభమైన అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత్‌కు చెందిన ముగ్గురు ఫైనల్లోకి...

ఫైనల్లో ముగ్గురు భారత అథ్లెట్లు

800 మీ. సెమీస్‌లో వెంకట్రామ్‌

అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్

యూజీన్‌ (అమెరికా): ఇక్కడ ప్రారంభమైన అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత్‌కు చెందిన ముగ్గురు ఫైనల్లోకి ప్రవేశించారు. జావెలిన్‌ త్రోలో ఆశిష్‌ యాదవ్‌ (69.87 మీ.), ధరణీధరన్‌ (68.07 మీ.), మహిళల డిస్కస్‌ త్రోలో అమానత్‌ కాంబోజ్‌ (52.58 మీ) ఫైనల్లో చోటు దక్కించుకున్నారు. ఇక పురుషుల 800 పరుగులో కర్నూలు జిల్లాకు చెందిన వెంకట్రామ్‌రెడ్డి ఒక నిమిషం 52.81 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి తన హీట్‌-5లో మూడో స్థానంలో నిలిచి సెమీస్‌ చేరాడు. ఇదే విభాగం హీట్‌-1 బరిలో దిగిన తమిళనాడు రన్నర్‌ ఉవిన్‌ ఆనంద్‌ విఫలమయ్యాడు.

Updated Date - Aug 07 , 2026 | 04:16 AM