అన్‌మోల్ ‘ఆరే’శాడు!
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:05 AM
టోర్నీలో అదరగొడుతున్న కెప్టెన్ అన్‌మోల్ ఎక్కా ఏకంగా ఆరు గోల్స్‌తో సంచలన ప్రదర్శన చేశాడు. దాంతో...
సెమీస్‌కు భారత్
ఆసియా కప్ హాకీ
మోకి (చైనా): టోర్నీలో అదరగొడుతున్న కెప్టెన్ అన్‌మోల్ ఎక్కా ఏకంగా ఆరు గోల్స్‌తో సంచలన ప్రదర్శన చేశాడు. దాంతో ఆసియా కప్ జూనియర్ హాకీ పురుషుల విభాగంలో భారత్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ ఆఖరి మ్యాచ్‌లో మనోళ్లు 15-0తో చైనీస్ తైపీని చిత్తు చేశారు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో ఎలీట్ పూల్‌లో తలపడుతున్న భారత్ బుధవారంనాటి చివరి మ్యాచ్‌ను చైనాతో గోల్స్ లేకుండా డ్రా చేసింది. దక్షిణ కొరియా పూల్ ‘ఎ’ నుంచి రెండో సెమీస్ బెర్త్ దక్కించుకుంది. శుక్ర వారం జరిగే సెమీస్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది.