అర్ధ సెంచరీలతో రాణించిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్.. భారత్ స్కోర్ 191/8
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:36 PM
హామిల్టన్‌లో జరుగుతున్న ఐదో టీ20లో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 61, శ్రేయస్ అయ్యర్ 50 పరుగులతో రాణించారు.
స్పోర్ట్స్ డెస్క్: హామిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదో టీ20 జరుగుతోంది. టాస్ నెగ్గిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేంది. ఇషాన్ కిషన్(61), శ్రేయస్ అయ్యర్(50) అర్ధ సెంచరీలతో రాణించారు. ఓపెనర్లు సంజూ శాంసన్(4), అభిషేక్ శర్మ(1) విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి స్కోర్ బోర్డును కదిలించాడు. నమన్ 33, నితీశ్ కుమార్ రెడ్డి 22 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ ఆఖరి మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. నాలుగో టీ20లో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. తిరిగి జట్టులో చేరాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కింది.