వరల్డ్ కప్-2026 ఫైనల్‌కి చేరిన భారత్
ABN , Publish Date - Feb 04 , 2026 | 08:28 PM
అండర్-19 వన్డే ప్రపంచ కప్-2026లో ఫైనల్‌కు యువ భారత్ దూసుకెళ్లింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్-2లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్‌ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది.
స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 వన్డే ప్రపంచ కప్ (U19 World Cup-2026)లో ఫైనల్‌కు యువ భారత్ దూసుకెళ్లింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్-2లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్‌ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ అరోన్ జార్జి (115) సెంచరీతో చెలరేగాడు. మరోఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (68; 33 బంతులు) విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే (62), విహాన్ మల్హోత్రా (38*) రాణించారు. శుక్రవారం (ఫిబ్రవరి 6) జరగనున్న ఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి.