ఆసియాడ్ ప్రదర్శనపై 13న సమీక్ష
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:18 AM
ఆసియా క్రీడల్లో భారత ప్రదర్శనపై కేంద్ర క్రీడా శాఖ ఈనెల 13న సమీక్ష నిర్వహించనుంది. బ్యాడ్మింటన్, షూటింగ్, అథ్లెటిక్స్‌లో సీనియర్ ఆటగాళ్ల నిరాశాజనక ప్రదర్శనపై..
బ్యాడ్మింటన్, షూటింగ్‌పై ప్రధాన దృష్టి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత ప్రదర్శనపై కేంద్ర క్రీడా శాఖ ఈనెల 13న సమీక్ష నిర్వహించనుంది. బ్యాడ్మింటన్, షూటింగ్, అథ్లెటిక్స్‌లో సీనియర్ ఆటగాళ్ల నిరాశాజనక ప్రదర్శనపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. అంతేకాదు టార్గెట్ ఒలింపిక్స్ పోడియం ఫినిష్ (టాప్స్)కు నిధుల విడుదల విషయంలోనూ పునఃపరిశీలన చేయనున్నట్టు సమాచారం. ఇటీవల ముగిసిన నగోయ ఆసియాడ్‌లో 21 స్వర్ణాలు సహా మొత్తం 85 పతకాలను మన అథ్లెట్లు సాధించిన విషయం విదితమే. గత హాంగ్జౌ ఆసియా క్రీడల్లో గెలుపొందిన 106 పతకాలతో పోలిస్తే..తక్కువ మెడల్సే ఈసారి లభించాయి.