ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:17 PM
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్‌ను భారత్- ఎ గెలిచింది. ఇవాళ శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్‌లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్‌ను భారత్- ఎ గెలిచింది. ఇవాళ(ఆదివారం) శ్రీలంక- ఎతో జరిగిన ఫైనల్‌లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది.
వనుజ సహన్ (62), సదీర సమరవిక్రమ (52) అర్ధ శతకాలతో లంక విజయం కోసం పోరాడారు.విజయకాంత్ వియాస్కాంత్ 39, సహన్ అరచ్చిగే 38, నిరోషన్ డిక్వెల్లా 25 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు భారత బౌలర్ల దెబ్బకు పెవిలియన్ కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ చెరో మూడు వికెట్లు సాధించారు. అలానే అనుకుల్ రాయ్ 2, అశోక్ శర్మ, తిలక్ వర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.