రాణించిన భారత బ్యాటర్లు.. అఫ్గాన్-ఎ టార్గెట్ 320
ABN , Publish Date - Jun 17 , 2026 | 02:31 PM
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత, అఫ్గానిస్థాన్ 'ఎ' తలపడ్డాయి. ఫైనల్‌కు చేరాలంటే కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇవాళ(బుధవారం) భారత, అఫ్గానిస్థాన్ 'ఎ' తలపడ్డాయి. ఫైనల్‌కు చేరాలంటే కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో అఫ్గాన్ జట్టు ముందు 320 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది.