నా భార్య దుఃఖాన్ని ఆపలేకపోయా
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:38 AM
భారత డ్రెస్సింగ్ రూమ్ సమాచారాన్ని బహిర్గతం చేశాడనే ఆరోపణలు తన కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందిపెట్టాయని..
న్యూఢిల్లీ: భారత డ్రెస్సింగ్ రూమ్ సమాచారాన్ని బహిర్గతం చేశాడనే ఆరోపణలు తన కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందిపెట్టాయని ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా భారత డ్రెస్సింగ్ రూమ్‌లో విషయాలను బయటకు వెల్లడించాడని సర్ఫరాజ్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆ కష్టకాలంలో మొదట కోచ్ గంభీర్ నాకు రెండుసార్లు ఫోన్ చేశాడు. నిరాధార కథనాల గురించి పట్టించుకోకుండా ఆటపై దృష్టిసారించమని సలహా ఇచ్చాడు. కానీ, ఆ ఆరోపణల విషయంలో మా నాన్న ఎక్కువ బాధపడ్డాడు. ఇక నా భార్య అయితే ఏడుస్తూనే ఉంది. ఆమె దు:ఖాన్ని ఆపలేకపోయా’ అని ఆకాశ్ చోప్రా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు.