గెలుపు దిశగా హైదరాబాద్
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:09 AM
త్రిపురతో గ్రూప్ ‘బి’ రంజీట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఓవర్‌నైట్ స్కోరు 121/4తో సోమవారం తొలి ఇన్నిం గ్స్ కొనసాగించిన హైదరాబాద్ 294 పరుగులకు ఆలౌటైంది.
త్రిపురతో రంజీ
హైదరాబాద్: త్రిపురతో గ్రూప్ ‘బి’ రంజీట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఓవర్‌నైట్ స్కోరు 121/4తో సోమవారం తొలి ఇన్నిం గ్స్ కొనసాగించిన హైదరాబాద్ 294 పరుగులకు ఆలౌటైంది. కిందటి రోజు బ్యాటర్లు రుతిక్ మెండే (61), తన్మయ్ అగర్వాల్ (54) అర్ధ శతకాలతో మెరిశారు. చామా మిలింద్ (40), రాహుల్ రాధేశ్ (40) రాణించారు. త్రిపుర యువ ఆఫ్ స్పిన్నర్ సందీప్ సర్కార్ (8/96) ఎనిమిది వికెట్లతో అదరగొట్టాడు. త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులే చేయడంతో ఆతిథ్య జట్టుకు 160 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లోనూ త్రిపుర బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో రెండో రోజు ఆఖరికి ఆ జట్టు 99/7 స్కోరుతో నిలిచింది. తనయ్ త్యాగరాజన్ మూడు, కెప్టెన్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు.
శతక్కొట్టిన శ్రీరామ్: శ్రీరామ్ రాహుల్ (108 బ్యాటింగ్) శతకంతో, కీపర్ రేవంత్ రెడ్డి (97) అర్ధ శతకంతో చెలరేగడంతో విజయవాడలో నిరుటి రన్నరప్ కర్ణాటకతో జరుగుతున్న గ్రూప్ ‘బి’ పోరులో ఆంధ్ర కీలకమైన 57 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 16/2తో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర ఆట ఆఖరికి 6 వికెట్లకు 331 రన్స్ చేసింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 274 రన్స్‌కు ఆలౌటైన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్‌లో ఛత్తీస్‌గఢ్ తో మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (102) శతకంతో సత్తా చాటాడు. దాంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 392 రన్స్‌కు ఆలౌటైంది. అనంతరం ఛత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండోరోజు ముగిసేసరికి 122/3 స్కోరుతో నిలిచింది.