ప్రణవ్ తీన్‌మార్
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:53 AM
ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్ ఐస్ స్కేటర్ సూరపనేని ప్రణవ్ మాధవ్ మూడు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్ ఐస్ స్కేటర్ సూరపనేని ప్రణవ్ మాధవ్ మూడు పతకాలు సాధించి, సంచలనం సృష్టించాడు. డెహ్రాడూన్‌లో జరిగిన ఈ పోటీల్లో చైనా, దక్షిణ కొరియా సహా 14 దేశాల స్కేటర్లు పాల్గొన్నారు. ప్రణవ్ 1000 మీటర్ల ఈవెంట్‌లో రజతం, 500 మీ., విభాగంలో కాంస్యం, పురుషుల రిలేలో కాంస్యం కొల్లగొట్టాడు. గతంలో జరిగిన జాతీయ పోటీల్లో ప్రణవ్ ఈ మూడు విభాగాల్లో స్వర్ణాలు సాధించి, జాతీయ చాంపియన్‌గా నిలవడం విశేషం.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు