రగ్బీలో హైదరాబాద్ బోణీ
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:27 AM
రగ్బీ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ హీరోస్ బోణీ కొట్టింది. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రగ్బీ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ హీరోస్ బోణీ కొట్టింది. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ 31-17తో ఢిల్లీ రెడ్జ్‌పై గెలిచింది. మహిళల విభాగంలో కోల్‌కతా బంగా టైగర్స్ జట్టు 33-26తో చెన్నై బుల్స్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో ముంబై డ్రీమర్స్ పురుషుల జట్టు 19-7తో బెంగళూరు బ్రేవ్ హార్ట్స్‌పై నెగ్గింది.