Share News

అమ్మాయిలు అదరహో!

ABN , Publish Date - Aug 19 , 2026 | 05:38 AM

చైనాను నిలువరించి జోష్‌ మీదున్న భారత మహిళల జట్టు.. వరల్డ్‌క్‌పలో రెండో మ్యాచ్‌లో అరడజను..

అమ్మాయిలు అదరహో!

6-1తో దక్షిణాఫ్రికాపై భారత్‌ గెలుపు

అమ్‌స్టెల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): చైనాను నిలువరించి జోష్‌ మీదున్న భారత మహిళల జట్టు.. వరల్డ్‌క్‌పలో రెండో మ్యాచ్‌లో అరడజను గోల్స్‌తో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-డిలో మంగళవారం ఏకపక్షంగా సాగిన పోరులో భారత్‌ 6-1తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 4 పాయింట్లతో టాప్‌లో నిలిచిన మన అమ్మాయిలు.. రెండో రౌండ్‌ బెర్త్‌ అవకాశాలను మెరుగుపర్చుకొన్నారు. టొప్పో (11వ నిమిషం), నవ్‌నీత్‌ కౌర్‌ (17వ), సుశీలా చాను (25వ), దీపిక (38వ), లాల్‌రిమ్సియామి (44వ), సాక్షి రాణా (45వ) తలో గోల్‌ చేశారు. సౌతాఫ్రికా తరఫున కైలా డి వాల్‌ (55వ) ఏకైక గోల్‌ సాధించింది. గ్రూప్‌లో గురువారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది.

Updated Date - Aug 19 , 2026 | 05:38 AM