Share News

ముగిసిన గుజరాత్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..

ABN , Publish Date - Mar 31 , 2026 | 09:51 PM

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది.

ముగిసిన గుజరాత్ ఇన్నింగ్స్..  పంజాబ్ టార్గెట్ ఎంతంటే..
Gujarat Titans vs Punjab Kings match

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో నేడు పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ 162 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు తడబడ్డారు.

పంజాబ్ టాస్ గెలవడంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్స్‌ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించారు. అయితే, సాయి సుదర్శన్ (13) త్వరగా పెవిలియన్ బాట పట్టడంతో గిల్ దూకుడును కొనసాగించాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసే సమయానికి గుజరాత్ 54 పరుగులు చేయగలిగింది. 29 బంతుల్లో 39 పరుగులు చేసి ఫామ్‌‌లో ఉన్న గిల్‌ను పదవ ఓవర్‌లో యజ్వేంద్ర చాహల్ పెవిలియన్ బాట పట్టించాడు.


ఆ తరువాత కూడా యజ్వేంద్ర చాహల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ దూకుడు తగ్గింది. గ్లెన్ ఫిలిప్స్ (25) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విజయకుమార్ వైషాక్ బౌలింగ్‌లో గ్లెన్ కూడా వెనుదిరగాల్సి వచ్చింది. జాస్ బట్లర్ (38) కూడా చాహల్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారీ స్కోరుపై గుజరాత్ పెట్టుకున్న ఆశలు కనుమరుగయ్యాయి. చివర్లో మార్కో యాన్సెన్, వైశాఖ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వాషింగ్టన్ సుందర్ (18), షారుఖ్ ఖాన్‌లు(4) తడబడి పెవిలియన్ బాటపట్టారు. దీంతో, గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేయగలిగింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ మూడు వికెట్లు, యజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు, మార్కో యాన్సెన్ ఒక వికెట్‌ను తీశారు.

Updated Date - Mar 31 , 2026 | 10:02 PM