WPL 2026: ముగిసిన గుజరాత్ బ్యాటింగ్.. యూపీ టార్గెట్ 154
ABN , Publish Date - Jan 22 , 2026 | 09:10 PM
డబ్ల్యూపీఎల్ (WPL 2026)లో భాగంగా వడోదర వేదికగా యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన యూపీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: డబ్ల్యూపీఎల్ (WPL 2026)లో భాగంగా వడోదర వేదికగా యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ (UPWw vs GGw) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన యూపీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సోఫీ డివైన్(42బంతుల్లో 50) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. ఆమెతో పాటు బెత్ మూనీ(38) రాణించడంతో ఆ స్కోర్ అయినా చేయగలిగింది. వీరిద్దరూ రాణించకుంటే గుజరాత్ స్వల్ప స్కోర్కే పరిమితం అయ్యేది.
డివైన్, బెత్ మూనీ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ ఆశించిన మేర పరుగులు రాబట్టలేదు. డాని వ్యాట్ హాడ్జ్ 14, అనుష్క శర్మ 14 కష్వీ గౌతమ్ 11 పరుగులు చేశారు. గుజరాత్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఇద్దరు రన్ ఔట్ కావడం గమన్హారం. ఇక యూపీ బౌలర్లలో క్రాంతి గౌడ్, సూఫీ ఎకిల్ స్టోన్ చెరో రెండు వికెట్లు సాధించారు. అలానే దీప్తీ శర్మ, క్లో ట్రయాన్ చెరో వికెట్ తీశారు. మొత్తంగా యూపీ వారియర్స్ ముందు గుజరాత్ జెయింట్స్ 154 పరుగుల ఓ మోస్తారు టార్గెట్‌ను ఉంచింది.