Share News

ఆటతోనే జవాబిచ్చాం..

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:24 AM

కొన్నాళ్లుగా విఫలమవుతున్నారంటూ తమపై వస్తున్న విమర్శలకు ఇప్పుడు ఆటతోనే జవాబిచ్చామని స్టార్‌ డబుల్స్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌...

ఆటతోనే జవాబిచ్చాం..

న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా విఫలమవుతున్నారంటూ తమపై వస్తున్న విమర్శలకు ఇప్పుడు ఆటతోనే జవాబిచ్చామని స్టార్‌ డబుల్స్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లో వరల్డ్‌ నెం.1 చైనా ద్వయం చేతిలో ఓడిన గాయత్రి/ట్రీసా కాంస్యంతో టోర్నీని ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ‘ఇది మాకు అద్భుత వారం. ఎంతో భావోద్వేగం, మరెన్నో మరిచిపోలేని సంఘటనల సమాహారం. కాంస్యం గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పతక స్వప్నం చిరకాలం గుర్తుండిపోతుంది. సెమీఫైనల్లో 100 శాతం సత్తా చాటాం. కానీ ఆ రోజు మాది కాలేదు’ అని గాయత్రి వివరించింది. ఐస్‌క్రీమ్‌ తినడం ద్వారా పతక సంతోషాన్ని సెలెబ్రేట్‌ చేసుకున్నామని వెల్లడించింది. ప్రత్యర్థులకు తేలికగా పాయింట్లు ఇవ్వకపోవడమే తమ ఆటలో కీలకమని ట్రీసా తెలిపింది. అయితే ‘చైనా ప్లేయర్లతో తలపడే సమయంలో మనం రెండు పాయింట్లు వెనుకంజ వేసినా..వారు దానిని అనుకూలంగా మలుచుకొని మ్యాచ్‌పై పట్టు సాధిస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి’ జాలీ వివరించింది.

Updated Date - Aug 24 , 2026 | 06:24 AM